అక్బరుద్దీన్ సభలో సీఐ వేదిక ఎక్కినట్లు ఆధారాలుంటే ఇవ్వాలని మజ్లిస్‌కు నోటీసులిచ్చాం: డీసీపీ
- సంతోష్ నగర్ బహిరంగ సభలో సీఐ సభా వేదిక పైకి ఎక్కినట్లు ఆధారాలు లేవన్న డీసీపీ
- అక్బరుద్దీన్ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
- ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని వెల్లడి
మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ నెల 21న సంతోష్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో స్థానిక సీఐ సభా వేదిక పైకి ఎక్కినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా సంతోష్ నగర్ సీఐ సభా వేదికపైకి వచ్చినట్లు మజ్లిస్ నేతలు చేసిన ఆరోపణలపై దర్యాఫ్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే వారు ఆరోపించినట్లుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఈ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని డీసీపీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. సీఐ వేదిక ఎక్కినట్లు ఆధారాలు ఉంటే గనుక సమర్పించాలని మజ్లిస్ పార్టీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామని తెలిపారు.