కొల్లాపూర్‌లో బర్రెలక్క తరఫున జానకీపురం సర్పంచ్ నవ్య ప్రచారం
- కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తరఫున ప్రచారం కోసం బయలుదేరిన సర్పంచ్ నవ్య
- నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చిన శిరీషకు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి
- శిరీషను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిద్దామని పిలుపు
కొల్లాపూర్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఆమెకు యువత, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కర్నె శిరీషకు యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆర్థిక సాయం అందించిన సంగతి విదితమే. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన జానకీపురం సర్పంచ్ నవ్య నుంచి కూడా శిరీషకు మద్దతు లభించింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నవ్య వెలుగులోకి వచ్చారు.
స్టేషన్ ఘనపూర్ నుంచి ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన నవ్యకు నిరాశ ఎదురైంది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ఆమెకు వజ్రం గుర్తును కేటాయించింది. ఆమె జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో బిజీగా ఉన్న నవ్య కొల్లాపూర్‌లో శిరీషకు మద్దతివ్వడమే కాకుండా ప్రచారం చేస్తానని ప్రకటించి, ఆమె కొల్లాపూర్ బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ముందుకు వచ్చిన శిరీషకు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే ఆమె తరఫున ప్రచారం చేసేందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. శిరీషకు కేవలం నిరుద్యోగులు, యువత మాత్రమే కాదని, ఉద్యోగులు, మేధావులు, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. శిరీషను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిద్దామని పిలుపునిచ్చారు.