కేసీఆర్ దగ్గర కారు మాత్రమే ఉంది.. స్టీరింగ్ వేరేవాళ్ల వద్ద ఉంది: స్మృతి ఇరానీ
- రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామన్న స్మృతి ఇరానీ
- కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని వ్యాఖ్య
- బీజేపీ గెలిస్తే శుద్ధమైన మంచి నీరు, ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామన్న స్మృతి ఇరానీ
కరోనా నేపథ్యంలో మరో రెండున్నరేళ్ల పాటు అర్హులైన పేదలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామని, కానీ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఉంటే ఇలాంటివి ఇచ్చి ఉండేవి కావని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆమె గురువారం ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ దగ్గర కేవలం కారు మాత్రమే ఉందని, స్టీరింగ్ మాత్రం వేరేవాళ్ల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
దళితబంధులో అసలైన లబ్ధిదారుల కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లబ్ధి పొందారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మంచి నీటి సమస్య ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే శుద్ధమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.