జగ్గారెడ్డి గెలవడు కానీ... ముఖ్యమంత్రి అవుతాడట: హరీశ్ రావు సెటైర్లు
- జానారెడ్డి పోటీ కూడా చేయడం లేదు... సీఎం అవుతానని చెబుతున్నాడన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా
- బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూలేని తెలంగాణను చూస్తున్నామన్న మంత్రి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నారని, కానీ ఆయన సంగారెడ్డి నుంచి గెలిచే పరిస్థితి లేదని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ జనారెడ్డి పోటీ కూడా చేయడం లేదు కానీ సీఎం అవుతానని చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రులు ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సంగారెడ్డిలో ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూ లేని తెలంగాణను చూస్తున్నామన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. షాదీ ముబారక్ వంటి పథకం అండగా నిలుస్తోందని చెప్పారు. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం ఐదు ఎకరాలు ఇచ్చామని, మైనార్టీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో పదిహేడువేల మంది ఇమామ్‌లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉన్నారని తెలిపారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని, నర్సింగ్ కాలేజీ వచ్చిందని తెలిపారు. మళ్లీ గెలిచిన తర్వాత రూ.2 కోట్లతో సంగారెడ్డి, సదాశివపేటలలో మైనార్టీలకు షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.