హైదరాబాద్, బెంగళూరులోని ఆస్తులను అమ్మేస్తున్న విప్రో

  • దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో విప్రోకు నాలుగో స్థానం
  • హైదరాబాద్ గచ్చిబౌలిలోని 14 ఎకరాలు, బెంగళూరులోని 25 ఎకరాలు విక్రయించాలని నిర్ణయం
  • ఇప్పటికే ప్రారంభమైన మదింపు ప్రక్రియ
  • అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును కార్యకలాపాల స్థిరీకరణ కోసం వెచ్చించాలని నిర్ణయం
హైదరాబాద్, బెంగళూరులోని ఆస్తులను విక్రయించాలని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును కార్యకలాపాల స్థిరీకరణం కోసం వినియోగించాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 14 ఎకరాలు, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న 25 ఎకరాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆస్తుల మదింపు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు విప్రో నిరాకరించింది.

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో నాలుగోదైన విప్రోకు బెంగళూరులో మూడు, హైదరాబాద్‌లో మూడు ఆస్తులు ఉన్నాయి. సంస్థలో మొత్తం 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు వీరంతా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే, ఇకపై వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాల్సిందేనని ఆదేశించింది.


More Telugu News