కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అవకాశమివ్వరు: బీజేపీ కిషన్ రెడ్డి
- బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటించగలవా? అని ప్రశ్న
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతారని ఎద్దేవా
- కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ కలలు కంటున్నారని సెటైర్లు
రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశమివ్వరని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి మారుతారని చురకలు అంటించారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించరన్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ప్రజలు బీజేపీకే అవకాశమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మెడికల్ కాలేజీ కోసం వందలాది ఉత్తరాలు రాశానని కేసీఆర్ చెబుతున్నారని, వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు ఎందుకు ఆలస్యం అవుతోంది? అని ప్రశ్నించారు.