వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • మధ్యాహ్నం భారీగా పతనమై చివర్లో పుంజుకున్న మార్కెట్లు
  • 92 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 28 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్లు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడంతో చివర్లో పుంజుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 66,023కి చేరుకుంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 19,811 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (1.50%), ఇన్ఫోసిస్ (1.27%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.24%), టైటాన్ (0.94%), టెక్ మహీంద్రా (0.87%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండస్ బ్యాంక్ (-2.10%), కోటక్ బ్యాంక్ (-1.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.00%), మారుతి (-0.42%).


More Telugu News