ఐదు భాషల్లో భయపెట్టే సిరీస్ .. 'ది విలేజ్'

  • ఆర్య హీరోగా రూపొందిన 'ది విలేజ్' 
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే సిరీస్
  • అతీంద్రియ శక్తులను టచ్ చేస్తూ సాగే కథ  
  • 'అవళ్' దర్శకుడి మరో ప్రయత్నం

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై హారర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ కనెక్ట్ కావాలేగానీ, రికార్డుస్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్  ప్రైమ్ నుంచి మరో హారర్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ  వెబ్ సిరీస్ పేరే 'ది విలేజ్'. హీరో ఆర్య ప్రధానమైన పాత్రగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 24 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  

హీరో తన ఫ్యామిలీతో కలిసి సరదాగా రోడ్ ట్రిప్ కి వెళతాడు. ఒక రాత్రివేళ ఒక విలేజ్ దగ్గరికి రాగానే కారు ట్రబుల్ ఇస్తుంది. ఫ్యామిలీని కారులోనే ఉండమని చెప్పి, సహాయం కోసం హీరో ఆ ఊళ్లోకి వెళతాడు. ఆ ఊరు ఎంత ప్రమాదకరమైనదనే విషయం అతనికి తెలియదు. అతను తిరిగి వచ్చేసరికి ఫ్యామిలీ అదృశ్యమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ. 

అతీంద్రియ శక్తుల నేపథ్యంలో నడిచే కథ ఇది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్టుగానే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. రాధాకృష్ణన్ నిర్మించిన ఈ సిరీస్ కి 'మిలింద్ రౌ' దర్శకత్వం వహించాడు. గతంలో సిద్ధార్థ్ హీరోగా ఈ దర్శకుడు తెరకెక్కించిన 'అవళ్' సినిమా ఎంతగా భయపెట్టిందనేది తెలిసిందే.


More Telugu News