'ధ్రువ నక్షత్రం'పై ఆసక్తిని పెంచుతున్న 'జైలర్' విలన్!

  • గౌతమ్ మీనన్ నుంచి 'ధ్రువ నక్షత్రం'
  • విక్రమ్ తో తలపడే విలన్ గా వినాయకన్ 
  • సంగీతాన్ని అందించిన హారీస్ జైరాజ్ 
  • ఈ నెల 24న నాలుగు భాషల్లో విడుదల

దర్శక నిర్మాతగా గౌతమ్ మీనన్ 'ధ్రువ నక్షత్రం' సినిమాను రూపొందించాడు. హీరోగా విక్రమ్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విక్రమ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. 

ఈ సినిమాపై ఆసక్తిని పెంచే మరో అంశం ఉంది .. అదే విలనిజం. హీరోతో తలపడే విలన్ గా వినాయకన్ నటించాడు. 'జైలర్' సినిమాలో విలన్ గా వినాయకన్ మంచి మార్కులు కొట్టేశాడు. రజనీకాంత్ ను 'సారూ .. సారూ' అంటూనే ప్రేక్షకులను భయపెట్టేశాడు. ఆ సినిమా హైలైట్స్ లో ఆయన విలనిజం ఒకటిగా నిలిచింది. 

అలాంటి వినాయకన్ 'ధ్రువ నక్షత్రం'లో విలన్ గా నటిస్తుండటంతో, అందరూ కూడా ఈ సినిమా పట్ల మరింత కుతూహలంతో ఉన్నారు. హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, రీతూ వర్మ కథానాయికగా కనిపించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలను రాధిక .. సిమ్రన్ .. పార్తీబన్ .. గౌతమ్ మీనన్ .. అర్జున్ దాస్ పోషించారు. 


More Telugu News