ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్ మన తెలంగాణలోనే.. ఎక్కడంటే!
- సిద్దిపేటలో పూర్తయిన గుడి ప్రింటింగ్
- సింప్లీ ఫోర్జ్, అప్సుజా కంపెనీలు సంయుక్తంగా రూపకల్పన
- మూడు గర్భాలయాలు, మూడు గోపురాలతో తయారీ
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీడీలో ఓ ఆలయం తయారైంది. రోబోటిక్స్ కన్ స్ట్రక్షన్ 3డి ప్రింటింగ్ సాయంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఈ టెంపుల్ మన తెలంగాణలోని సిద్దిపేటలో తయారుకావడం విశేషం. పూర్తిస్థాయిలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ గుడి ప్రింట్ అవుతోంది. సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్, అప్సుజా ఇన్ ఫ్రాటెక్ కంపెనీల భాగస్వామ్యంలో ఈ గుడి తయారైంది. దీనిని ప్రింటింగ్ చేయడానికి 3 నెలల సమయం పట్టిందని, మొత్తంగా గుడి నిర్మాణానికి ఐదున్నర నెలలు పట్టిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ గుడి ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ టెంపుల్ గా రికార్డులకెక్కనుంది.
మూడు గర్భాలయాలు, మూడు గోపురాలతో ఈ గుడిని అత్యంత సుందరంగా ప్రింట్ చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. 35.5 అడుగుల పొడవు, 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో మూడు భాగాలుగా ప్రింట్ అయింది. గణేశుడికి మోదకం, చతురస్రాకారంలో శివాలయం, పార్వతి దేవి కోసం కమలం ఆకారంలో మూడు గోపురాలను ప్రింట్ చేశారు.
.