నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్రపతి.. కారణం ఇదే!
- నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్రపతి
- డాక్టరేట్లను, బంగారు పతకాలను ప్రదానం చేయనున్న ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఈ సందర్భంగా 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.