నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ జోరు... రూ.751 కోట్ల ఆస్తుల అటాచ్

  • యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యకలాపాలు
  • నేషనల్ హెరాల్డ్ కు ప్రచురణకర్తగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ 
  • యంగ్ ఇండియన్ లో ప్రమోటర్లుగా సోనియా, రాహుల్ గాంధీ
  • ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలోని 'నేషనల్ హెరాల్డ్' పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణ కర్తగా ఉంది. అయితే, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. 

ఈ కేసులో మనీలాండరింగ్ కోణం కూడా ఉన్న నేపథ్యంలో ఈడీ వేగం పెంచింది. తాజాగా, రూ.751.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు పలు నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులు ఉన్నాయని... యంగ్ ఇండియన్ సంస్థకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ లో రూ.90.21 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయని ఈడీ వివరించింది.


More Telugu News