ఏపీ విభజన చట్టం అంశాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష సమావేశం

  • కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం
  • ఏపీ తరఫున హాజరైన సీఎస్ జవహర్ రెడ్డి బృందం  
  • ఎన్నికల కారణంగా సమావేశానికి దూరంగా ఉన్న తెలంగాణ అధికారులు
ఏపీ విభజన చట్టంలోని అంశాలు-అమలుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నేడు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, విద్యా సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, 13వ షెడ్యూల్ అనుసరించి ఆస్తుల విభజన తదితర అంశాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. 

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ తరఫున సీఎస్ జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి, ప్రేమచంద్రారెడ్డి, ఎస్ఎస్ రావత్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికల కారణంగా తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

విభజన జరిగి పదేళ్లవుతున్నప్పటికీ... ఏపీ, తెలంగాణ మధ్య అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉండడం పట్ల కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని పలుమార్లు కోరారు.


More Telugu News