మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా 'కన్నప్ప' నుంచి క్రేజీ అప్డేట్
- మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'కన్నప్ప'
- ఆయన సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా
- న్యూజిలాండ్ లో జరుగుతున్న చిత్రీకరణ
- ముఖ్య పాత్రల్లో సీనియర్ స్టార్స్
మంచు విష్ణు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' గురించి జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా రోజురోజుకూ తన స్థాయిని పెంచుకుంటూపోతోంది. ప్రతీ ఇండస్ట్రీలోని ఓ స్టార్ ఈ 'కన్నప్ప'లో పాలుపంచుకుంటున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ .. శరత్ కుమార్ ఇలా అందరూ 'కన్నప్ప'లో నటిస్తున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాకతో 'కన్నప్ప' మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సైతం ఓ కీలక రోల్‌ను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ న్యూజిలాండ్ లో షూటింగ్ చేస్తోంది. దాదాపు 80 శాతం షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్‌లోనే జరగనుంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్, న్యూజిలాండ్ ప్రకృతి అందాలు 'కన్నప్ప' సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి.
మంచు విష్ణు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా 'కన్నప్ప' నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఈ మేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 2.45 గం.లకు, న్యూజిలాండ్‌లో 10.15గం.లకు అప్డేట్ రాబోతున్నట్టుగా ట్వీట్ వేశారు. ఇక ఈ అప్డేట్ తరువాత సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగేట్టున్నాయి.
'మహాభారతం' సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ 'కన్నప్ప' చిత్రాన్ని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఇదొక మైలురాయిగా నిలిచేట్టు రూపొందిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, కథను చెప్పే విధానం, మేకింగ్ తీరు ఇలా అన్నీ కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోనున్నాయి.