మద్యం అనుమతుల కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
- చంద్రబాబు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న సీఐడీ
- చంద్రబాబును ఏ3గా పేర్కొన్న వైనం
- ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన టీడీపీ అధినేత
- నేడు చంద్రబాబు తరఫు వాదనలు విన్న హైకోర్టు
- రేపు సీఐడీ తరఫు వాదనలు
మద్యం అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపటి విచారణలో సీఐడీ తరఫు వాదనలు విననుంది.
కాగా, ఇవాళ చంద్రబాబు తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే సమయంలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదని నాగముత్తు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశంపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతోనే ఈ కేసు నమోదు చేశారన్న విషయం అర్థమవుతోందని కోర్టుకు విన్నవించారు. ప్రివిలేజ్ ఫీజు కూడా నిబంధనల మేరకే తీసుకున్నారని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా, కొల్లు రవీంద్రను ఏ2గా పేర్కొన్నారు. దాంతో, చంద్రబాబు, కొల్లు రవీంద్ర ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.