కేసుల భయంతో జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడంలేదు: సీపీఐ నారాయణ

  • కృష్ణా జలాల పునఃపంపిణీ నోటిఫికేషన్ కు నిరసనగా సీపీఐ రామకృష్ణ దీక్ష
  • సంఘీభావం ప్రకటించిన నారాయణ
  • జగన్ ఢిల్లీకి వెళ్లేది కేసుల మాఫీ కోసమేనని వెల్లడి
  • జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని విమర్శలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసుల భయంతో సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని వివరించారు. జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా కేసుల మాఫీ కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మాట్లాడడంలేదని ఆరోపించారు. 

ఏపీలో నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయాయని, ఓవైపు రైతులు కరవుతో అల్లాడిపోతుంటే రాష్ట్రంలో కరవు తీవ్రత తక్కువగా ఉందనేలా సీఎం జగన్ మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు. 

కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ గెజిట్ నోటిఫికేషన్ ను నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో 30 గంటల దీక్ష చేపట్టారు. రామకృష్ణకు నారాయణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ పై నారాయణ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News