ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

  • కొమోరిన్ ప్రాంతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి
  • ద్రోణితో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు
  • దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిరుపతి జిల్లా గూడూరులో 9 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటలో 7 సెంమీ, నెల్లూరు నగరంలో 9 సెంమీ వర్షపాతం నమోదైనట్టు వివరించింది. నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News