తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం: సీపీఐ నారాయణ జోస్యం
- కేసుల కోసమే జగన్ ఢిల్లీకి వెళ్తారన్న నారాయణ
- జగన్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరవు నెలకొందని విమర్శ
- కరవు మండలాల సంఖ్యను జగన్ తగ్గించి చెపుతున్నారని మండిపాటు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పోలింగ్ కు 10 రోజుల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఎన్నికల్లో గెలవడానికి సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లేది ఆయన కేసుల కోసమేనని విమర్శించారు.
ఏపీలో 440 మండలాల్లో కరవు ఉంటే... ఆ సంఖ్యను జగన్ తగ్గించి చెపుతున్నారని నారాయణ మండిపడ్డారు. కరవు నష్టపరిహారంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని చెప్పారు. తక్షణమే రైతులకు నష్టపరిహారంతో పాటు రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.