షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇది ఫేక్ వీడియోనా అంటూ ప్రశ్న!

  • షిమ్లా నుంచి పాంగ్లీ లోయ వరకూ ఉన్న రోడ్డు వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • సన్నని రోడ్డు, పక్కనే ఉన్న లోయను చూసి ఆందోళన, ఇది నిజమేనా అంటూ ప్రశ్న
  • ఇలాంటి రోడ్లు హిమాలయాల్లో అనేకం ఉన్నాయంటూ నెటిజన్ల జవాబులు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనకు తెలిసిన విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అప్పుడప్పుడూ తన సందేహాలను కూడా నెటిజన్ల ముందుపెడతారు. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇది నిజమో కాదో చెప్పండంటూ నెటిజన్లను కోరారు. 

షిమ్లా నుంచి పాంగీకి వెళ్లే పర్వత మార్గం ఇదేనంటూ ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ రోడ్డును చూసి ఆనంద్ మహీంద్రాను నమ్మలేకపోయారు. ఒక్క బస్సు మాత్రమే పట్టేంత వెడల్పు ఉన్న రోడ్డు..ఆ పక్కనే భారీ లోయ.. ఏ చిన్న పొరపాటు జరిగినా బస్సు లోయలో పడటం ఖాయం. వీడియోలోని ఈ దృశ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ‘‘ఇక్కడ దృశ్యాలకు ఎవరో మార్పులు చేసినట్టుగా ఉంది. ఇలాంటి రోడ్డు ఒకటి ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ప్రమాదానికి ఎదురెళ్లేందుకు జనాలు సిద్ధంగా ఉంటారని అనుకోను. బ్యాక్‌ గ్రౌండ్‌లో వినపడుతున్న మాటలు ఏంటి? ఇది నిజమోకాదో దయచేసి చెప్పండి’’ అని నెటిజన్లను కోరారు.

ఇది నిజమేనని అనేక మంది రిప్లై ఇచ్చారు. హిమాలయాల్లో ఇలాంటి రహదారులు కొన్ని ఉన్నాయని తెలిపారు. ఇలాంటి రోడ్లపై బస్సుల్లో వెళ్ళడం కంటే కాలినడకన వెళ్లడమే మంచిదని మరికొందరు సూచించారు.


More Telugu News