ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు చాహల్‌కు దక్కని చోటు.. ఆవేదన బయటపెట్టిన లెగ్‌స్పిన్నర్
- 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ
- ఎల్లుండే తొలి మ్యాచ్
- చిన్న ఎమోజీతో బాధను పంచుకున్న చాహల్
- బాధపడొద్దంటున్న నెటిజన్లు
ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఎల్లుండి (23న) విశాఖలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత టీ20 జట్టుకు చాలా కాలంగా సారథ్యం వహిస్తున్న హార్ధిక్ పాండ్యా ప్రపంచకప్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్‌కు పగ్గాలు అప్పగించారు.
మరోవైపు సంజుశాంసన్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వంటి వారికి జట్టులో చోటు దక్కలేదు. చాహల్ చివరిసారి ఆగస్టులో విండీస్ పర్యటనలో ఆడాడు. ఆసీస్‌తో సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై చాహల్ ఆవేదనగా స్పందించాడు. కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీతో సింపుల్‌గా తన మనసులోని బాధను బయటపెట్టాడు. ఈ పోస్టుకు నెటిజన్లు కామెంట్లతో స్పందిస్తున్నారు. బాధపడకని కొందరు, మరింత బలంగా జట్టులోకి వస్తావని ఇంకొందరు చాహల్‌ను ఓదారుస్తున్నారు.