తలెత్తుకోండి.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియాతో కపిల్‌దేవ్

  • రోహిత్ సేనకు కపిల్‌దేవ్ ప్రశంస
  • చాంపియన్స్‌లా ఆడారని కితాబు
  • మీరెప్పుడో చాంపియన్స్‌గా నిలిచారన్న కపిల్‌దేవ్
  • స్ఫూర్తిని కోల్పోవద్దని పిలుపు
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపై 1983 ప్రపంచకప్ హీరో కపిల్‌దేవ్ స్పందించాడు. ‘చాంపియన్స్‌లా ఆడారు.. సగర్వంగా తలెత్తుకోండి’’ అని ప్రశంసించాడు. మీ మెదళ్లలో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేకుండా ఆడారని, కాబట్టి మీరెప్పుడో విజేతగా నిలిచారని కొనియాడాడు. జట్టును చూసి దేశం గర్విస్తోందన్నాడు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు నీ కోసం ఎదురుచూస్తున్నాయని రోహిత్‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు. 

ఇది కష్టకాలమని తెలిసినా స్ఫూర్తిని కోల్పోవద్దని, దేశం మొత్తం నీకు (రోహిత్) అండగా ఉందని పేర్కొన్నాడు. కాగా, భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ డిస్నీ హాట్‌స్టార్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మాధ్యమం ద్వారా ఏకంగా 5.9 కోట్ల మంది మ్యాచ్‌ను వీక్షించారు. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ రికార్డు (5.3 కోట్లు) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. లీగ్ దశలో ఇండియా-కివీస్ మ్యాచ్‌ను 4.3 కోట్ల మంది చూస్తే.. టీమిండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ను 4.4 కోట్ల మంది వీక్షించారు.


More Telugu News