జీన్స్ వేసుకోమంటూ అత్త ఒత్తిడి.. పోలీసులకు కోడలి ఫిర్యాదు
- ఉత్తరప్రదేశ్‌లో సీన్ రివర్స్
- జీన్స్‌కు అలవాటుపడ్డ అత్త, పుట్టింట్లో సంప్రదాయబద్ధంగా పెరిగిన కోడలు
- వేధింపులు తట్టుకోలేక పోలీసులకు యువతి ఫిర్యాదు
- కుటుంబసభ్యుల మధ్య రాజీ కోసం పోలీసుల ప్రయత్నం
సాధారణంగా యువతీయువకులు ఆధునిక వస్త్రధారణ వైపే మొగ్గు చూపుతారు. సంప్రదాయక దుస్తులను ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య సీన్ రివర్స్ కావడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, హరిపర్వత్‌కు చెందిన ఓ యువకుడికి ఎత్మాద్‌పూర్ పరిధిలో ఉంటున్న యువతితో గతేడాది పెళ్లైంది. అయితే, జీన్స్ ధరించేందుకు అలవాటు పడిపోయిన అత్త తన కోడలిని కూడా జీన్స్ వేసుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ విషయమై వారి మధ్య గొడవలు పతాకస్థాయికి చేరడంతో ఏం చేయాలో తెలియని కోడలు చివరకు ఆగ్రా పోలీసులను ఆశ్రయించింది. ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే కొడుతున్నారు’’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, వారి మధ్య సమోధ్య కుదిర్చేందుకు తాము కృషి చేస్తున్నట్టు స్థానిక ఏసీపీ తెలిపారు.