శబరిమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 22 ప్రత్యేక రైళ్లు

  • అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
  • తేదీలతో సహా రైళ్ల వివరాలను సోమవారం ప్రకటించిన రైల్వే
  • భద్రతా ప్రమాణాలతో నడపడంపై దృష్టి పెట్టిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. రైళ్లు బయలుదేరనున్న తేదీలు, వివరాలను వివరాలను వెల్లడించింది. ఈ నెల 26న, డిసెంబరు 3 తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లం, ఈ నెల 28, డిసెంబరు 5 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 26, డిసెంబరు 3 తేదీలలో నర్సాపూర్‌-కొట్టాయం, ఈ నెల 27, డిసెంబర్ 4 తేదీల్లో కొట్టాయం-నర్సాపూర్‌, ఈ నెల 22, 29 డిసెంబరు 6 తేదీల్లో కాచిగూడ-కొల్లం, ఈ నెల 24, డిసెంబరు 1, 8 తేదీల్లో కొల్లం-కాచిగూడ రైళ్లు నడవనున్నాయి.

ఇక ఈ నెల 23, 30న కాకినాడ-కొట్టాయం, ఈ నెల 25, డిసెంబరు 2న కొట్టాయం-కాకినాడ, ఈ నెల 24, డిసెంబరు 1 తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లం, ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని రైల్వే స్పష్టం చేసింది. మరోవైపు ఈ ప్రత్యేక రైళ్లను భద్రతా ప్రమాణాలతో నడపడంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ దృష్టిసారించారు. ఆరు డివిజన్ల అధికారులతో సోమవారం ఆన్‌లైన్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు చేశారు.


More Telugu News