విభజన కారణంగా ఏపీకి తీవ్ర నష్టం జరిగింది: సీఎం జగన్
- విభజన అంశాలపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం
- సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష
- విభజన చట్టంలోని హామీల అమలు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టీకరణ
- ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని వెల్లడి
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా విభజన చట్టంలోని అంశాలు అమలుకు నోచుకోలేదని సీఎం జగన్ అన్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరిగిందని, విభజన చట్టంలోని హామీల అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటివరకు ఇవ్వలేదని, పోలవరం నిధుల హామీ నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇంకా రాలేదని అన్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేపు రాష్ట్ర విభజన అంశాలపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో విభజన హామీలు, 13వ షెడ్యూల్ లోని సంస్థలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఈ కీలక సమావేశం నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో నేడు సమీక్ష సమావేశం చేశారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.