జయలలితతో మాట్లాడటానికి శోభన్ బాబునే ఆసక్తిని చూపించేవారు: దర్శకుడు జయకుమార్
- 'డాక్టర్ బాబు' సినిమా గురించి ప్రస్తావించిన జయకుమార్
- అప్పుడే జయలలితతో శోభన్ బాబు పరిచయం జరిగిందని వెల్లడి
- మూడు కార్లలో జయలలిత షూటింగుకి వచ్చేవారని వ్యాఖ్య
- శోభన్ బాబు విగ్ ను సెట్ చేసింది అప్పారావు అని వివరణ
కె. విశ్వనాథ్ దగ్గర అనేక సినిమాలకు పని చేసిన జయకుమార్, ఆ తరువాత కాలంలో కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబు గారు నన్ను తమ్ముడూ అని పిలిచేవారు. అప్పారావుగారు అని ఆయన పర్సనల్ మేకప్ మేన్ శోభన్ బాబు కోసం 'రింగ్'తో కూడిన విగ్ సెట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది" అన్నారు.
'డాక్టర్ బాబు' సినిమా సమయంలోనే శోభన్ బాబుకి .. జయలలితకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగుకి జయలలిత మూడు నాలుగు కార్లలో ఒక యువరాణిలా వచ్చేవారు. ఒక కారులో మేకప్ .. కాస్ట్యూమ్స్, మరో కారులో ఫ్రూట్స్ .. కూలర్ .. ఫ్యాన్, మరో కారులో నుంచి ఆమె దిగేవారు. ఆమెతో మాట్లాడటానికి ముందుగా శోభన్ బాబుగారే ఆసక్తిని చూపేవారు" అని చెప్పారు.
"ఇక 'సంపూర్ణ రామాయణం' సినిమా షూటింగును, 'రంపచోడవరం' స్కూల్లో ఉంటూ, 'మారేడుమిల్లి'లో చేసేవాళ్లం. శోభన్ బాబుగారితో కబుర్లు చెప్పడానికి చంద్రకళ వచ్చినప్పటికీ, ఆయన రగ్గు కప్పుకుని మా దగ్గరికి వచ్చి మాతో పాటు చలికాచుకుంటూ కూర్చునేవారు" అంటూ ఆనాటి సంగతులను గురించి చెప్పారు.