ఓటమితో వెక్కివెక్కి ఏడ్చేసిన సిరాజ్.. ఓదార్చిన బుమ్రా.. వీడియో ఇదిగో!

  • ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్
  • ఓటమిని జీర్ణించుకోలేకపోయిన మహ్మద్ సిరాజ్
  • కళ్లలోంచి ఉబికి వచ్చిన నీళ్లు
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని భారత ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆటగాళ్లు లోలోన మథనపడితే మహ్మద్ సిరాజ్ అయితే వెక్కివెక్కి ఏడ్చేశాడు. బుమ్రా అతడిని ఓదార్చాడు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా విషణ్ణ వదనాలతో కనిపించారు. మ్యాచ్‌ను కోల్పోయిన వెంటనే సిరాజ్ నియంత్రించుకోలేకపోయాడు. కళ్లలోంచి అప్రయత్నంగానే నీళ్లు ఉబికి వచ్చాయి. గమనించిన బుమ్రా సహా ఇతర ఆటగాళ్లు అతడిని ఓదార్చారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. 



More Telugu News