ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న మోహన్ లాల్ మూవీ!

  • మలయాళంలో 2018లో వచ్చిన 'ఒడియన్'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించిన మోహన్ లాల్ 
  • ఆశించిన స్థాయిలో దక్కని రెస్పాన్స్ 
  • ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై మలయాళ అనువాద సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా ఇప్పుడు మోహన్ లాల్ సినిమా 'ఈటీవీ విన్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'ఒడియన్'. మలయాళంలో ఈ సినిమా 2018లోనే థియేటర్లకు వచ్చింది. అక్కడ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 

'జనతా గ్యారేజ్' తరువాత మోహన్ లాల్ కి ఇక్కడ క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. 'మన్యం పులి' వంటి అనువాదాలు ఇక్కడ విజయాలను అందుకున్నాయి. అందువలన 'ఒడియన్' టైటిల్ తోనే ఈ సినిమాను తెలుగులోను విడుదల చేశారు ... కానీ ఇక్కడ అంతగా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. ఆ సినిమాను ఇప్పుడు తెలుగు వెర్షన్ లో 'ఈటీవీ విన్' ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. 

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ప్రకాశ్ రాజ్ .. మంజువారియర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి.


More Telugu News