‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన విరాట్ కోహ్లీ

  • 90.31 సగటుతో వరల్డ్ కప్‌లో అదరగొట్టిన విరాట్
  • 11 మ్యాచ్‌ల్లో మొత్తం 765 పరుగులు కొట్టిన పరుగుల యంత్రం
  • టోర్నీలో మొత్తం 3 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి వరల్డ్ కప్ 2023లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ దక్కింది. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 90.31 సగటుతో 765 పరుగులు బాదాడు. దీంతో 2003 వరల్డ్ కప్‌లో అత్యధికంగా 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో కోహ్లీ కొట్టినన్ని పరుగులు ఇంతవరకు ఏ ఆటగాడు సాధించలేదు. కోహ్లీ 11 మ్యాచ్‌‌లు ఆడగా సగటు 95.62, స్ట్రైక్ రేట్ 90.31గా ఉంది. ఈ టోర్నీలో 3 సెంచరీలు ఉన్నాయి. లీగ్ దశలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో న్యూజిలాండ్‌‌పై కోహ్లీ శతకాలు నమోదు చేశాడు.

విరాట్‌‌ని ఓదార్చిన అనుష్క శర్మ
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడం పట్ల భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీళ్లతో కనిపించారు. సహచర క్రికెటర్లు వీరిని ఓదార్చారు. కింగ్ విరాట్ కోహ్లీని భార్య అనుష్క శర్మ ఓదార్చింది. అప్యాయంగా హత్తుకొని ధైర్యం చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


More Telugu News