వరల్డ్ కప్ ఫైనల్ కు నన్నెవరూ ఆహ్వానించలేదు: కపిల్ దేవ్
- అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
- టీమిండియా వర్సెస్ ఆసీస్
- క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కు అందని ఆహ్వానం
భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ ఓ మహోన్నత శిఖరం. 1983 ముందు వరకు అనామక జట్టుగా ఉన్న భారత్ ను ప్రపంచకప్ విజేతగా నిలిపిన యోధుడు కపిల్ దేవ్. తన ప్రతిభతో భారత్ కు ప్రపంచ క్రికెట్ పటంలో సమున్నత స్థానం కల్పించిన సిసలైన ఆల్ రౌండర్. అలాంటి దిగ్గజ క్రికెటర్ కు వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు ఆహ్వానం లభించలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ కు తనను బీసీసీఐ ఆహ్వానించలేదని తెలిపారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ కు రావాలని తనను ఎవరూ పిలవలేదని, అందుకే ఆ మ్యాచ్ కు వెళ్లలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 1983లో కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులందరినీ ఇవాళ్టి ఫైనల్ కు పిలుస్తారని భావించానని, అయితే, క్రికెట్ పెద్దలు ఎంతో బిజీగా ఉండడం వల్ల తమ విషయం మర్చిపోయి ఉంటారని కపిల్ దేవ్ పేర్కొన్నారు.