నవంబర్ 30 తర్వాత బీఆర్ఎస్సే ఉండదు... ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కడ ఉంటారు?: మల్లు భట్టి విక్రమార్క
- పదేళ్ల కాలంలో కేసీఆర్ కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న మల్లు భట్టి
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ నేత
- గత ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపణ
నవంబర్ 30న ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మధిరలోని జానకీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నేను ఇక్కడే ఉంటాను... నాకు ఓటు వేయండని బీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని, కానీ పోలింగ్ తర్వాత ఆ పార్టీయే ఉండదు... ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కడ ఉంటారు? అని మల్లు భట్టి చురకలు అంటించారు. ఈ పదేళ్ల కాలంలో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
ఆరోగ్యశ్రీ ఇచ్చింది.. రోడ్లు వేసింది.. కరెంట్ ఇచ్చింది.. అన్నీ కాంగ్రెస్సే చేసిందన్నారు. అందుకే అభివృద్ధి చేసే కాంగ్రెస్‌ను గెలిపించాలని, అభివృద్ధిని పక్కన పెట్టిన బీఆర్ఎస్ మనకు వద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంపదను పేదలకు పంచుతామన్నారు. కేసీఆర్ గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.