భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ పండుగ.. ఏపీలోని 13 జిల్లాల్లోనూ బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు
- ఫైనల్ ఫీవర్‌తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులు
- విశాఖ బీచ్‌లో కాళీమాత ఆలయం ఎదురుగా ఫ్యాన్ పార్క్
- నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- బిగ్‌స్క్రీన్స్ ఏర్పాటుకు జగన్ అనుమతినిచ్చారన్న ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి
- 2-3 లక్షల మంది మ్యాచ్‌ను వీక్షించే అవకాశం
ప్రపంచకప్ ఫీవర్ భారత్‌ను కుదిపేస్తోంది. బిగ్‌ఫైట్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రోహిత్‌సేన ప్రపంచకప్ కొట్టాలని దేశం మొత్తం ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రత్యేక ఏర్పాటు చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్టణం బీచ్‌రోడ్డులో కాళీమాత ఆలయం ఎదురుగా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంచక్కా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. క్రికెట్ అభిమానులు, ఫుడ్ స్టాల్స్ కోసం ఎలాంటి ఎంట్రీ పాస్‌లు ఉండవు కాబట్టి ఎంచక్కా లోపల పెద్ద తెరపై మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. ఫైనల్ మ్యాచ్‌ను 2-3 లక్షల మంది వీక్షించే అవకాశం ఉందని ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.
బీచ్ రోడ్డులో బిగ్‌స్క్రీన్ ఏర్పాటు ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్టు చెప్పిన విశాఖ డీసీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీనివాసరావు తెలిపారు. క్రికెట్ స్టేడియం సమీపంలోని ప్రజలు హైవే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.