వరల్డ్ కప్ ఫైనల్స్.. వాతావరణ శాఖ అంచనా ఇదే!
- మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకి కావచ్చని అభిమానుల్లో టెన్షన్
- నేడు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ భరోసా
- 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం
మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే తుదిపోరుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే, వాతావరణం ఎలా ఉండబోతోందో? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ అంశంపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు వర్షం పడే సూచనలు ఏమీ లేవని భరోసా ఇచ్చింది. వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో పాటూ ఉష్ణోగ్రత 32 డిగ్రీల మేర ఉండొచ్చని తెలిపింది.