ఢిల్లీలో బీజేపీ నేతల వద్ద బక్కచిక్కిన పిల్లిలా వ్యవహరిస్తావు... ఇక్కడికొచ్చి...!: విజయసాయిపై వర్ల రామయ్య విమర్శలు
- అవినీతి ఘనాపాఠీ అంటూ విమర్శనాస్త్రాలు
- నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడడం తప్పు అంటూ వ్యాఖ్యలు
- వైఎస్ సీఎం కాకముందు విజయసాయి ఎక్కడుండేవారు అంటూ ఆగ్రహం
రాష్ట్రంలో పులిలా వ్యవహరిస్తూ, ఢిల్లీలో పిల్లిలా మారే విజయసాయి అవినీతి చరిత్ర అందరికీ తెలిసిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అవినీతి ఘనాపాఠీ విజయసాయి చంద్రబాబు గురించి మాట్లాడటం తప్పు అని విమర్శించారు. అదాని డిస్టలరీస్ తో సంబంధం లేదని చెప్పే ధైర్యముందా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు.
"ఏ2 విజయసాయిరెడ్డి గురివింద గింజ లాంటివాడు. విజయసాయి చరిత్ర అంతా అవినీతిమయం. ఏ1 అంటే జగన్మోహన్ రెడ్డి, ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని రాష్ట్రంలోని అందరికీ అర్థమైపోతుంది. సీబీఐ 11 కేసుల్లో విజయసాయిపై చార్జిషీట్ వేసింది. అదృష్టం కలిసొచ్చి కోట్లకు పడగలెత్తావు, ఆ కోట్లతో తిని, తాగి తందనాలాడాలిగానీ.. ఏ తప్పు చేయని, అవినీతి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం కరెక్టు కాదు.
అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయినంతమాత్రాన ఇలాంటి వ్యవహారశైలా? నీకు ఎలా వచ్చాయి కోట్లు? బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శిస్తూ మధ్యలో చంద్రబాబును లాగడమెందుకు? బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ట్వీట్ చేస్తూ మధ్యలో చంద్రబాబును తీసుకురావడమేంటి? ఢిల్లీలో బీజేపీ వారివద్ద బక్కచిక్కిన పిల్లిలా వ్యవహరిస్తావు, వంగి వంగి దండాలు పెడతావు, నీ బాంచన్ దొర కాల్మొక్తా అంటావు... రాష్ట్రానికొచ్చి బీజేపీ పట్ల పులిలా మాట్లాడుతావు. ధైర్యముంటే బీజేపీతో, మోదీతో, అమిత్ షాతో ఛాలెంజ్ చేయాలి.
2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉండేవారో ఒకసారి ఆలోచించుకోవాలి. చైన్నై లోని మౌంట్ రోడ్ లో చిన్న ఆఫీసు పెట్టుకుని ఉండేవాడని అందరికీ తెలుసు. నేను మీలా సభ్యతా, సంస్కారం లేనివాడిని కాదు. విజయసాయి ఆదాయం లక్ష కోట్లు దాటి ఉంటాయి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. ఎన్ని ఆడిటింగ్ లు చేస్తే, ఎన్ని ఇన్ కమ్ ట్యాక్స్ రిపోర్టులు తయారు చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి? అలాంటిది... సులభంగా సంపాదించే మార్గాలు వెతుక్కున్నావు" అంటూ విమర్శలు చేశారు.
విజయసాయి సాక్షులను ప్రభావితం చేయడంలో దిట్ట
విజయసాయిరెడ్డి పెద్ద మానిప్యులేటర్. తిమ్మిని బమ్మిని చేయడం, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయడం విజయసాయికి వెన్నతో పెట్టిన విద్య. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి బెయిల్ రావడానికి, అతను అప్రూవర్ గా మారడంలో విజయసాయి హస్తం ఉంది... కాకపోతే అతన్ని అప్రూవర్ గా అంగీకరించారు.
పదే పదే ఢిల్లీ లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి తరపున మాట్లాడితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ మీకు వార్నింగ్ ఇవ్వడం నిజంకాదా? నీవు అవినీతిపరుడు కాకపోతే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వెంటనే మీ సెల్ ఫోన్ ఎలా పోతుంది? ఎందుకు హడావిడిగా ఫోన్ పోయిందని కేసు రిజిస్టర్ చేయించావు? లిక్కర్ స్కామ్ కి నీకు ఉన్న సంబంధం బహిర్గతం అవుతుందనే ఫోన్ పోయిందని నాటకమాడావు.
ఆస్తుల పెంపుదలపై జగన్... విజయసాయికి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా?
ఇటీవల మీ ఆస్తుల పెంపుదలపై జగన్ వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? విజయసాయి అవినీతిపరుడు కాకపోతే రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ గా పేరు ఎందుకు తొలగించారు? అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే విజయసాయిరెడ్డి లాంటి వారిని ఇంటికి పంపడానికి జనం ఎదురుచూస్తున్నారు. ముందుంది ముసళ్ల పండుగ. అల్లుడి బ్రదర్ని అప్రూవర్ గా మార్చినవాడివి విజయసాయీ నువ్వు... నువ్వు అప్రూవర్ గా మారవని గ్యారంటీ ఏంటి? నీవు కూడా అప్రూవర్ గా మారుతావు.