జోరుమీదున్న యువ హీరో కార్తీక్ రాజు... కొత్త చిత్రం 'హస్తినాపురం' ప్రారంభం
- అథర్వ చిత్రంలో నటించిన కార్తీక్ రాజు
- డిసెంబరు 1న రిలీజ్ కానున్న 'అథర్వ'
- హైదరాబాదులో 'హస్తినాపురం' చిత్రం పూజా కార్యక్రమాలు
ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ రాజు తనయుడు కార్తీక్ రాజు టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నాడు. క్రైమ్, సస్పెన్స్ జానర్ లో కార్తీక్ రాజు నటించిన చిత్రం 'అథర్వ' డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే కార్తీక్ రాజు మరో చిత్రం పట్టాలెక్కించేశాడు. ఈ చిత్రం పేరు 'హస్తినాపురం'. 'ద స్టోరీ ఆఫ్ శమంతకమణి' అనేది క్యాప్షన్.
ఈ చిత్రం హైదరాబాదులో గ్రాండ్ గా ప్రారంభమైంది. చిత్ర యూనిట్ సభ్యులు హాజరు కాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు.
కాసు క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో హస్తినాపురం చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వీవీ వినాయక్ శిష్యుడు రాజా గండ్రోతు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాసు రమేశ్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు.