వరల్డ్ కప్ ఫైనల్ కోసం రూపొందించిన పిచ్ పై ఆసీస్ సారథి కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రేపు అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
- నువ్వా నేనా అంటున్న టీమిండియా, ఆసీస్
- పిచ్ ను పరిశీలించిన ఇరు జట్ల కెప్టెన్లు
- పిచ్ బాగానే ఉందన్న కమిన్స్
- ఈ పిచ్ పై వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ ఆడినట్టుగా ఉందని వెల్లడి
రేపు (నవంబరు 19) టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ ను టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ పరిశీలించారు.
పిచ్ ను పరిశీలించిన అనంతరం పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బాగుందని తెలిపాడు. అయితే ఇది ఇంతకుముందు ఉపయోగించిన పిచ్ లా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. బహుశా ఈ పిచ్ పై వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ (అక్టోబరు 14న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్) జరిగి ఉంటుందని భావిస్తున్నానని కమిన్స్ పేర్కొన్నాడు.
అయితే, పిచ్ స్వభావం ఎలాంటిదో చెప్పడానికి తానేమంత నిపుణుడ్ని కాదని, తనవరకైతే పిచ్ బాగానే ఉన్నట్టు కనిపించిందని వివరించాడు. తాను పిచ్ వద్దకు వెళ్లినప్పుడు గ్రౌండ్ సిబ్బంది నీళ్లతో తడిపి ఉంచారని, మరో 24 గంటలు గడిచాక దాన్ని మరోసారి పరిశీలిస్తే ఏదైనా చెప్పగలం అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.