ఇక ప్రేక్షకుల్లోంచి తన పేరు వినిపించదు అని కోహ్లీ చెప్పాడు: నవీనుల్ హక్
- ఐపీఎల్ లో కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య గొడవ
- నవీనుల్ హక్ ను టార్గెట్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్
- ఇటీవల వరల్డ్ కప్ లో ఆత్మీయ ఆలింగనం చేసుకున్న వైనం
- ఆ సమయంలో తాము ఏం మాట్లాడుకున్నామో వెల్లడించిన నవీనుల్ హక్
టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ, ఆఫ్ఘనిస్థాన్ పేసర్ నవీనుల్ హక్ మధ్య ఐపీఎల్ లో గొడవ జరగడం తెలిసిందే. ఇద్దరూ ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడం సోషల్ మీడియాలో కనిపించింది. ఆ గొడవ జరిగినప్పటి నుంచి నవీనుల్ హక్ ను కోహ్లీ అభిమానులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ చేయడమే కాదు, అతడు మ్యాచ్ ఆడుతుంటే స్టాండ్స్ లోంచి కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలు చేసేవారు.
అయితే, ఇటీవల ఢిల్లీలో వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, నవీనుల్ హక్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని తమ వివాదానికి ముగింపు పలికారు. ఆ సమయంలో కోహ్లీ తనతో ఏం చెప్పాడో నవీనుల్ హక్ తాజాగా వెల్లడించాడు.
"ఈ వివాదానికి ఇంతటితో చరమగీతం పాడదాం అని కోహ్లీ చెప్పాడు. దాంతో నేను కూడా తప్పకుండా అలాగే చేద్దాం అన్నాను. ఆ తర్వాత కోహ్లీ... ఇక నుంచి తన పేరు ప్రేక్షకుల్లోంచి వినిపించదు అని చెప్పాడు. ఇప్పటి నుంచి వారు నీ పేరే జపిస్తారు అని అన్నాడు. మేమిద్దరం కలిసిపోయిన క్షణాలు చాలా గొప్పగా అనిపించాయి" అని నవీనుల్ హక్ వివరించాడు.