ఏఐపై ‘అమెజాన్’ దృష్టి.. అలెక్సా విభాగంలో కోతలు
- అలెక్సా విభాగంలో కొన్ని వందల మంది ఉద్యోగుల తొలగింపు
- వాణిజ్య ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి వెల్లడి
- కస్టమర్లు కోరుకునే వాటిపై తమ శక్తియుక్తులు మళ్లిస్తున్నామని వ్యాఖ్య
కృత్రిమ మేధపై దృష్టిపెట్టిన అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన అలెక్సా వాయిస్ యూనిట్ విభాగంలో కోతలకు తెరతీసింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం పేర్కొంది. అలెక్సా విభాగంలోని కొన్ని వందల మందిని అమెజాన్ తొలగించినట్టు సమాచారం. ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు.
‘‘వ్యాపార ప్రాధాన్యాలకు అనుగుణంగా కస్టమర్లు కోరుకునే వాటిపై మా శక్తియుక్తులను మళ్లిస్తున్నాం. ఇందులో భాగంగా వనరులను పెంచుకుని, జనరేటివ్ ఏఐపై దృష్టి పెట్టాం’’ అని అలెక్సా, ఫైర్ టీవీ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రాష్ పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని కార్యక్రమాలకు ముగింపు పలకాల్సి వస్తోందని చెప్పారు. ఈ మధ్య కాలంలో అమెజాన్ మ్యూజిక్, గేమింగ్ విభాగాలకు వనరుల కేటాయింపును తగ్గించింది. చిన్న చిన్న హింట్లతో భారీ సాఫ్ట్‌వేర్స్ రూపొందించగలిగే జనరేటివ్ ఏఐఫై ప్రస్తుతం టెక్ కంపెనీలు దృష్టిపెడుతున్నాయి.