వరల్డ్ కప్ ఫైనల్ ముందు జరిగే కార్యక్రమాలు ఇవే!
- ఈ నెల 19న వరల్డ్ కప్ ఫైనల్
- టీమిండియా × ఆస్ట్రేలియా
- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్
- మ్యాచ్ కు ముందు వాయుసేన విమానాల విన్యాసాలు
- వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు సత్కారం
- గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీ
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ నెల 19న జరిగే ఫైనల్ సమరంలో భారత జట్టు ఆసీస్ ను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ముద్దాడాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు.
కాగా, రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది. అందుకోసం, ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ వైమానిక విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అనంతరం, ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలిచిన వివిధ జట్ల సారథులను సత్కరించనున్నారు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు బీసీసీఐ ప్రముఖులు ప్రత్యేక బ్లేజర్లను బహూకరించనున్నారు. తర్వాత గాయకుడు ప్రీతమ్ సంగీత కచేరీ ఉంటుంది.
ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండడం విశేషం. టోర్నీ విజేతలకు ఆయనే కప్ అందించనున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ పాప్ గాయని దువా లిపా కచేరీ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో, ఇదంతా వట్టి ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది.