మైనంపల్లి రోహిత్‌కు గుడికి, బడికి తేడా తెలియదు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
- రోజుకు 24 గంటలు ఉంటే 25 గంటల విద్యుత్ ఎలా ఇస్తాడని ప్రశ్న
- రోహిత్‌కు నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన లేదన్న పద్మా దేవేందర్ రెడ్డి
- ఏం తెలియకుండానే మెదక్‌కు వచ్చి ఏదో చేస్తానని చెబుతున్నాడని విమర్శ
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌కు గుడికి, బడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మైనంపల్లి రోహిత్‌కు మెదక్ నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటుందని, కానీ రోహిత్ మాత్రం 25 గంటలు విద్యుత్ ఇస్తానని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. రోజుకు ఎన్ని గంటలు ఉంటాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇరవై నాలుగు గంటల విద్యుత్ మేమే ఇస్తుంటే ఇక మీరు ఇవ్వడం ఏమిటన్నారు. ఏం తెలియకుండానే మెదక్‌కు వచ్చి ఏదో చేస్తానని చెబుతున్నాడని, అసలు ఇక్కడ ఏవి ఎన్ని ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు.