మరొక్క విజయం కోసం... ఫైనల్ ముంగిట టీమిండియా ప్రాక్టీస్... ఫొటోలు ఇవిగో!
- వరల్డ్ కప్ ఫైనల్ చేరిన టీమిండియా, ఆసీస్
- ఈ నెల 19న అహ్మదాబాద్ లో టైటిల్ సమరం
- గత రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
- నేడు మైదానంలో దిగి సాధన చేసిన ఆటగాళ్లు
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. టీమిండియా మరొక్క మ్యాచ్ గెలిస్తే ప్రపంచ కప్ విజేత అవుతుంది. ఈ నేపథ్యంలో, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు మైదానంలో కనిపించారు. రోహిత్ శర్మ ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లతో చర్చిస్తూ దర్శనమిచ్చాడు. అంతేకాదు, జట్టు సహచరుల సాధనను పరిశీలించాడు.
ఈ నెల 19న టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ పై నెగ్గి టీమిండియా... దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా... ఫైనల్ చేరుకున్నాయి.
2003 వరల్డ్ కప్ లోనూ టీమిండియా, ఆసీస్ ఫైనల్లో తలపడగా... దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఆసీస్ జట్టే విజేతగా నిలిచింది. ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. సొంతగడ్డపై ఆడుతుండడం టీమిండియాకు అదనపు బలం. ఏదేమైనా రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్ కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.