బీటెక్ రవిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ కొట్టివేత

  • ఈ నెల 14న బీటెక్ రవి అరెస్ట్
  • ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు
  • తిరస్కరించిన కడప కోర్టు
  • బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప జిల్లా పోలీసులు ఈ నెల 14న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో లోకేశ్ పర్యటన సందర్భంగా కడప ఎయిర్ పోర్టు వద్ద అధికారులతో దురుసుగా ప్రవర్తించారంటూ బీటెక్ రవిపై వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పెండింగ్ లో ఉన్న ఈ కేసులోనే బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. 

కాగా, బీటెక్ రవి కేసులో పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. ఆయనను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. బీటెక్ రవిని 5 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చింది. బీటెక్ రవి బెయిల్ పిటిషన్ పైనా న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.


More Telugu News