ఎస్ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై స్టే విధించిన ఏపీ హైకోర్టు

  • నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థులు
  • ఎత్తు అంశంలో ఇప్పుడు అనర్హులు అంటున్నారంటూ పిటిషన్
  • ఎస్ఐ అభ్యర్థుల తరఫున వాదించిన జడ శ్రావణ్ 
  • పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు
పోలీస్ విభాగంలో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) నోటిఫికేషన్ ప్రకియ నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు ఎస్సై ఉద్యోగ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల తరఫున ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. 

ఎత్తు అంశంలో తమకు అన్యాయం జరిగిందని ఓ పిటిషనర్ కోర్టుకు విన్నవించాడు. ఎత్తు అంశంలో గతంలో అర్హులైన వారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని వివరించాడు. ఎస్ఐ నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని కోర్టును కోరాడు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం... గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని నియామక బోర్డును ప్రశ్నించింది. అనంతరం పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ ఎస్ఐ నోటిఫికేషన్ పై స్టే విధించింది.


More Telugu News