కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, ధరణి స్థానంలో భూమాత... కాంగ్రెస్ మరిన్ని హామీలు ఇవే!

  • రేపు మేనిఫెస్టోను ప్రకటించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 
  • మెగా డీఎస్సీ ప్రకటన, ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ
  • విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సహా పలు హామీలు
తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు మరిన్ని హామీలను జత చేర్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఆయన మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ సహా పలు అంశాలను చేర్చారు. మేనిఫెస్టోలో చేర్చిన హామీలలో... 

* గ్రామపంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు, ఇందుకు తగిన నిధులు
* మెగా డీఎస్సీ ప్రకటన, ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ
* ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల, పారదర్శక నియామక ప్రక్రియ
* విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్
* విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు
* మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం
* మూతబడిన ఆరువేల పాఠశాలల పునఃప్రారంభం
* కొత్తగా నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు
* ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ 
* ప్రభుత్వ ఆసుపత్రుల అధునికీకరణ, మెరుగైన వైద్యం
* ధరణి స్థానంలో భూమాత పోర్టల్
* భూహక్కుల సమస్యల పోరాటానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు
* పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి హక్కులు కల్పించడం
* సర్పంచ్‌ల ఖాతాల్లో గ్రామపంచాయతీ అభివృద్ధి నిధుల జమ
* గ్రామపంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
* ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏల చెల్లింపు
* సీపీఎస్ రద్దు... ఓపీఎస్ తీసుకు రావడం
* కొత్త పీఆర్సీ అమలు.. ఆరు నెలల్లో అమలు చేయడం.. వంటి హామీలు ఉన్నాయి.


More Telugu News