మిల్లర్ సెంచరీ చేసినా దక్షిణాఫ్రికా స్కోరు 212 పరుగులే!

  • వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీఫైనల్
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఆసీస్ × దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు
  • 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్
  • 101 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్
  • స్టార్క్ కు 3, కమిన్స్ కు 3, హేజెల్ వుడ్ కు 2, ట్రావిస్ హెడ్ కు 2 వికెట్లు
వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో మెరిశాడు. మిల్లర్ 116 బంతుల్లో  101 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. 

ఓ దశలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఆ మాత్రం స్కోరు సాధించిందంటే అది మిల్లర్ చలవే. మిల్లర్... హెన్రిచ్ క్లాసెన్ (47), గెరాల్డ్ కోట్జీ (19)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 

టాస్ ఓడినప్పటికీ, పిచ్ పరిస్థితులను బాగా ఉపయోగించుకున్న ఆసీస్ బౌలర్లు వికెట్ల వేట సాగించారు. మిచెల్ స్టార్క్ 3, కెప్టెన్ పాట్ కమిన్స్ 3, జోష్ హేజెల్ వుడ్ 2, ట్రావిస్ హెడ్ 2 వికెట్లు తీశారు. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


More Telugu News