విశాఖ నుంచి నన్ను గెలిపించకపోతే ప్రజలకే నష్టం: కేఏ పాల్

  • అన్ని పార్టీలు తనకే మద్దతుగా ఉండటం సంతోషకరమన్న పాల్
  • మోదీని ఎదుర్కోగల సత్తా తనకు మాత్రమే ఉందని వ్యాఖ్య
  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తన కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడి
విశాఖ లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని... ఆయన తనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ పాల్ ఎంపీ అయితే బాగుంటుందని అనుచరులకు చెపుతున్నారని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తనను గెలిపించడానికి ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారో, లేదో తెలియదని అన్నారు. తాను విశాఖ ఎంపీని అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషకరమని చెప్పారు. పార్లమెంటులో ప్రధాని మోదీని ఎదుర్కోగల సత్తా తనకు మాత్రమే ఉందని అన్నారు. తనను, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోకపోతే ప్రజలకే నష్టమని చెప్పారు.


More Telugu News