నేడు రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆసీస్ అమీతుమీ... ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేదెవరో!

  • కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • నిన్న న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా
  • ఈ నెల 19న అహ్మదాబాద్ లో టైటిల్ పోరు
భారీ స్కోర్లు నమోదైన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్, పేసర్ షాన్ అబ్బాట్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. పేసర్ లుంగీ ఎంగిడి స్థానంలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ... ఆల్ రౌండర్ ఫెహ్లుక్వాయో స్థానంలో మార్కో యన్సెన్ జట్టులోకి వచ్చారు. 

కాగా, ఈ రెండో సెమీస్ లో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ టైటిల్ సమరం జరగనుంది.


More Telugu News