ఇజ్రాయెల్ అనుమానాలు నిజమే.. ఆసుపత్రిని ఆయుధాల డెన్‌గా మార్చేసిన హమాస్ ఉగ్రవాదులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇది!
- హమాస్ ఆయుధాగారంగా గాజాలోని అల్‌షిపా ఆసుపత్రి
- ఎమ్మారై భవనంలో కుప్పలు తెప్పలుగా ఆయుధాలు
- ఔషధాలు, ఆయుధాలు ఒక చోటే
- ఎమ్మారై మిషన్ వెనకే ఏకే-47 తుపాకులు
హమాస్ ఉగ్రవాదులు ఆసుపత్రులను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే వీడియో ఇది. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి ఎమ్మారై భవనంలో గుట్టలకొద్దీ ఆయుధాలు బయటపడ్డాయి. ఎమ్మారై మిషన్ ఉన్న గదిలోనే ఏకే 47, బ్యాక్‌ప్యాక్స్, ఇతర ఆయుధాలు కనిపించాయి. అంతేకాదు, ఆసుపత్రి మొత్తాన్ని ఉగ్రవాదులు ఆయుధాల డెన్‌గా మార్చేశారు.
ఇజ్రయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఈ బాగోతాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. 6.59 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఐడీఎప్ అధికారి ఒకరు ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఉగ్రవాదులు ఆయుధాలు ఎక్కడెక్కడ దాచింది సవివరంగా చూపించారు. ర్యాక్‌లలో ఔషధాలతోపాటు ఆయుధాలు, కత్తులు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు కనిపించాయి.
ఎమ్మారై గదిలో కంప్యూటర్, కమ్యూనికేషన్ రేడియో, ఫోన్, సీడీలు కూడా ఉన్నాయి. వీటిని విశ్లేషించాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అది పేరుకే ఆసుపత్రి అని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఔషధాలకు కొరత ఉందన్న వార్తలను అధికారి గుర్తుచేస్తూ.. అక్కడ ఔషధాలు గుట్టలుగా పడి ఉండడాన్ని చూపించారు. హమాస్ అరాచకాలకు ఇంతకుమించి ఉదాహరణ అవసరం లేదని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి జొనాథన్ కన్రికస్ పేర్కొన్నారు.