భగవద్గీత విషయంలో నా ఆవేదన అదే: గంగాధరశాస్త్రి

  • భగవద్గీత ప్రచారం కోసం కృషి చేస్తున్న గంగాధర శాస్త్రి 
  • భగవద్గీత మరణగీత కాదు అంటూ వెల్లడి 
  • అవగాహనా లోపమే అందుకు కారణమని వ్యాఖ్య
  • ఇది నిజంగా దురదృష్టకరమని ఆవేదన  

దేశ విదేశాల్లో భగవద్గీతను గురించిన ప్రచారం కోసం గంగాధర శాస్త్రి ఎంతగానో కృషి చేస్తున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, భగవద్గీతను గురించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. " భగవద్గీత మరణగీత కాదు .. కాదు అనే నేను ప్రతి ప్రసంగంలో చెబుతూ ఉంటాను. మరణం సమయంలో మాత్రమే భగవద్గీతను ప్రచారం చేయకూడదు .. ప్రసారం చేయకూడదు" అనేది నా అభిప్రాయం" అన్నారు. 

"జీవితాంతం భగవద్గీతను వింటూ ఉండండి .. అప్పుడు చనిపోయిన తరువాత పెట్టినా అభ్యంతరం లేదు. కానీ చనిపోయినప్పుడు మాత్రమే పెట్టడం కనిపిస్తోంది. చావుగీతగా దీనిని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా భగవద్గీతను గురించి ఎక్కడైనా చెబుతుంటే .. పాడుతుంటే, అక్కడ ఎవరో పోయారనే స్థితికి జనం చేరుకోవడం ప్రమాదకరం .. దురదృష్టకరం" అని చెప్పారు. 

భగవద్గీతను గురించి అవగాహన లేని వారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్లంతా మరణించిన చోట దానిని పెడుతున్నారు. శవయాత్రలో అది అలా మ్రోగుతూనే ఉంటుంది. సెలబ్రిటీస్ పోతే టీవీ చానల్స్ కూడా భగవద్గీతను ప్లే చేస్తున్నాయి. దాంతో భవిష్యత్తులో భగవద్గీతను గురించి మాట్లాడానికే భయపడవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. అందుకే ఈ పరిస్థితి మారాలనే నా ఆవేదనను వ్యక్తం చేస్తుంటాను" అని అన్నారు. 



More Telugu News