ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో విద్యార్థి మంచంకింద భారీ కొండచిలువ

  • బాయ్స్ హాస్టల్-2లో విద్యార్థి మంచం కింద నక్కిన కొండచిలువ
  • భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
  • గోనె సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేసిన అటవీ సిబ్బంది
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి మంచం కింద భారీ కొండచిలువ కనిపించి కలకలం రేపింది. విద్యార్థులు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. బాయ్స్ హాస్టల్-2లో ఓ విద్యార్థి మంచం కింద నక్కిన కొండచిలువను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీశారు.

విషయాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హాస్టల్‌కు చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను గోనె సంచిలో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దానిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే, హాస్టల్ గదిలోకి కొండచిలువ ఎప్పుడు? ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.


More Telugu News