విరాట్‌పై గంగూలీ ప్రశంసలు... అసాధారణ రికార్డు అంటూ కితాబు
- న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్‌లో విరాట్ 50వ వన్డే సెంచరీ
- సచిన్ సెంచరీల రికార్డును సమం చేసిన వైనం
- విరాట్‌పై గంగూలీ ప్రశంసలు
- విరాట్ రికార్డును బ్రేక్ చేయడం కష్టమని వ్యాఖ్య
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తూ 50 వన్డే సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన రికార్డును విరాట్ అధిగమించడం కంటే ఆనందం మరొకటి లేదని సచిన్ ప్రశంసించాడు. తాజాగా మరో క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కూడా విరాట్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్ 50వ సెంచరీ ఆసాధారణమని కితాబునిచ్చాడు.
విరాట్ ఇప్పటికీ టీం తరపున ఆడుతున్నందున అతడి రికార్డును అధిగమించడం మరో క్రికెటర్‌కు కష్టమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో నేడు జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. తొలి నుంచీ దూకుడుగా ఆడిన విరాట్ 42వ ఓవర్‌లో లాకీ ఫెర్‌గ్యూసన్ బాలింగ్‌లో సెంచరీ పూర్తి చేశాడు.